ఈరోజు, మా భాగస్వామి OneHope వారి సౌజన్యముతో, బాలల కొరకు బైబిల్ Appని తెలుగులో ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు, ఈ App ద్వార ఇదివరకటి కంటే ఎక్కువ మంది పిల్లలు వ్యక్తిగతముగా బైబిల్ అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని పొందగలరు.
App యొక్క సెట్టింగ్‌ల ద్వార, భాషను మార్చుకోవడం సులభం:
- ప్రస్తుత విడుదలకు మీ App నవీకరించబడిందని నిర్ధారించుకోండి.
- సెట్టింగులు తెరవడానికి Appని తెరిచి గేర్ చిహ్నం పై నొక్కండి ().
- భాష పై నొక్కండి ఆపై మీకు కావలసిన భాషను ఎంచుకోండి.
ఆడియో ఇప్పుడు ఆ భాషలో వినిపించబడుతుంది అంతేకాక అక్షరాలు కూడ అదే భాషలో చూపబడతాయి!
దయచేసి ఈ గొప్ప వార్తను వేడుకచేసుకోవడానికి మాకు సహాయపడండి!
బాలల కొరకు బైబిల్ App గురించి
OneHope భాగస్వామ్యంతో, బాలల కొరకు బైబిల్ Appని YouVersion, బైబిల్ App రూపకర్తల ద్వార రూపొందించబడింది. పిల్లలకు ఆనందమయ బైబిల్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన, బాలల కొరకు బైబిల్ App ఇప్పటికే 31 మిలియన్ల Apple, Android మరియు Kindle పరికరాల్లో ఇన్స్టాల్ చేయబడి నిత్యము ఉచితంగా అందించబడుతుంది. ప్రపంచం నలుమూలల గల పిల్లలు ఇప్పుడు, బాలల కోసం బైబిల్ Appని 47 భాషలలో ఆనందిస్తున్నారు – ఇప్పుడు తెలుగు తో సహా!
Helpful links:
Bible versions in Telugu
Telugu Audio Bible
బైబిల్ అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయండి
Bible App for Kids in Telugu
Download the Bible App in Telugu
ఈ పోస్ట్ క్రింద భాషలలొ కూడా అందుబాటులో ఉంది: ఇంగ్లీష్